రాష్ట్ర దుస్థితిని నేషనల్ ఛానల్స్ లో దండోరా వేసేలా చేశాడు జగన్ రెడ్డి: నాగబాబు

  • రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందన్న నాగబాబు
  • ఏపీ మరో శ్రీలంక అవుతుందని గతంలోనే పవన్ చెప్పారని వ్యాఖ్య
  • ఏపీని అవహేళన చేసేలా జగన్ పాలన ఉందని విమర్శ
ఏపీ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దారుణంగా తయారయిందని జనసేన నేత నాగబాబు విమర్శించారు. ఆంధ్ర పరిస్థితిని... కాదు కాదు... రాష్ట్ర దుస్థితిని నేషనల్ ఛానల్స్ లో దేశ వ్యాప్తంగా దండోరా వేసేలా జగన్ రెడ్డి చేశారని దుయ్యబట్టారు. అప్పులతో ఏపీ మరో శ్రీలంక అవుతుందని గతంలో పవన్ కల్యాణ్ హెచ్చరిస్తే వైచీపీ ప్రబుద్ధులు హేళన చేశారని అన్నారు. అభివృద్ధి లేకుండా అప్పులు మాత్రమే తెచ్చి బటన్ లు నొక్కడం ద్వారా ఆంధ్ర పరువును ఈరోజు జాతీయంగా, రేపు అంతర్జాతీయంగా కూడా తీయగల సమర్థులు జగన్ అని దుయ్యబట్టారు. 151 సీట్లు ఇచ్చినందుకు ఏపీని ఆదర్శంగా తీసుకునేలా పాలిస్తారనుకుంటే... అవహేళన చేసేలా పాలించారని విమర్శించారు. మీరెన్ని సిద్ధం బ్యానర్లు పెట్టుకున్నా... మళ్లీ మిమ్మల్ని నమ్మేందుకు జనం సిద్ధంగా లేరని అన్నారు. 


Nagababu
Pawan Kalyan
Janasena
Jagan
YSRCP

More Telugu News